కూడేరుకు జూనియర్ కళాశాల మంజూరు

కూడేరుకు జూనియర్ కళాశాల మంజూరు

– ఎంపీపీ నారాయణరెడ్డి

AP 39TV న్యూస్, కూడేరు:

కూడేరు మండలానికి జూనియర్ కళాశాల మంజూరు అయింది. బుధవారం ఎంపీపీ నారాయణరెడ్డి విలేకరులకు తెలిపారు. జూనియర్ కాలేజ్ లేక విద్యార్థులు ఇబ్బంది పడే వారన్నారు. ఈ విషయాన్ని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి ఆయన ద్వారా ఏప్రిల్ నెలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నార్పలకు వచ్చినప్పుడు సీఎం దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. జూనియర్ కళాశాల మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేసినట్లు ఆయన చెప్పారు.స్పందించిన ముఖ్యమంత్రి కళాశాల మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. కళాశాల మంజూరు చేసినందుకు ఎంపీపీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

 

 

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Comments (0)
Add Comment