Home AP ఆంధ్ర క్రికెట్ కు కులం రంగు వేయకండి

ఆంధ్ర క్రికెట్ కు కులం రంగు వేయకండి

14
0

*ఆంధ్ర క్రికెట్ కు కులం రంగు వేయకండి*

 

*రఘు రామ కృష్ణంరాజు ఎంపీ పద్ధతి మార్చుకో*

 

*శరత్ చంద్ర రెడ్డి, గోపీనాథ్ రెడ్డి, రోహిత్ రెడ్డి లపై ఆరోపణలు చేస్తే చర్యలు తప్పవు*

 

*ఆంధ్ర క్రికెట్ తో నీకేంటి సంబంధం?*

 

*పద్ధతి మార్చుకోకపోతే నీ ఇల్లు ను క్రికెటర్లతో ముట్టడిస్తాం*

 

*ఆంధ్ర క్రికెట్ ను ఎక్కువ కాలం పరిపాలించింది మీ కులం వారే ఇది వాస్తవం కాదా?*

 

*ఆంధ్ర క్రికెటర్లకు పింఛన్ సౌకర్యం*

 

*శరత్ చంద్రా రెడ్డి నాయకత్వంలోనే క్రికెట్ అభివృద్ధికి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏ.పీ.ఎల్) నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహించారు*

 

*మచ్చా రామలింగారెడ్డి*

*రాష్ట్ర అధ్యక్షులు*

*ఆంధ్రప్రదేశ్ వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్*

 

👉ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 70 సంవత్సరాలుగా పనిచేస్తోంది ఆంధ్రలో క్రికెట్ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన అసోసియేషన్ అనేక సంవత్సరాలుగా రాజకీయ నాయకులే రాజ్యమేలుతున్నారని ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమీ లేదని మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ అన్నారు.

 

👉రఘు రామ కృష్ణంరాజు ఎం.పీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాస్తవాలను వివరిస్తున్నానని మచ్చా రామలింగారెడ్డి అన్నారు రోడ్డు భవనాల అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మచ్చా రామలింగారెడ్డి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు సంబంధించిన అనేక అంశాల మీద మాట్లాడుతూ మీడియాకు వివరించారు.

 

👉రఘు రామ కృష్ణంరాజు తనకు రాజకీయాలు చేయాలనుకుంటే చేసుకోండి ఆంధ్ర క్రికెట్ ను ఎందుకు లాగుతారు ఇది మంచి పద్ధతి కాదు వాస్తవాలు తెలిస్తే మాట్లాడండి లేకపోతే మౌనంగా ఉండండి ఆంధ్ర క్రికెట్ ప్రతిష్టను దెబ్బతీయకు పద్ధతి మార్చుకో అని మచ్చా రామలింగారెడ్డి హెచ్చరించారు.

 

👉ఇప్పటి వరకు రెండు కులాలు మాత్రమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో రాజ్యమేలాయి ఇది వాస్తవం

 

👉ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రారంభమైనప్పటి నుంచి క్రికెటర్లు ఎంపికైన చరిత్ర చాలా తక్కువ ఎప్పుడు రాజకీయ నాయకులే రాజ్యమేలారు

 

👉క్రికెట్ అసోసియేషన్లో రాజకీయ నాయకులు రాజ్యమేలడం ఆంధ్ర క్రికెట్లో ఎప్పుడో ప్రారంభమైంది

 

👉రఘురామకృష్ణంరాజు ఎంపీ క్రికెట్ అంటే నీకు ఏమో తెలీదు నువ్వు నీతులు చెప్తావా మీ కులం వారు ఉంటే ఏ రోజైనా క్రికెట్ గురించి మాట్లాడావా..

 

👉దేశంలో అన్ని రాష్ట్రాల్లో రాజకీయ నాయకులే క్రికెట్ అసోసియేషన్ లో రాజ్యమేలుతున్నారు ఇది నీకు తెలియదా ఏదో ఆంధ్రాలో ఒక్కటే ఉన్నట్లు నీ మాట తీరేంటి వాస్తవాలు మాట్లాడు ఎంపీగా రాజుగారు నీ పద్ధతి మార్చుకోండి క్రికెట్లో కులాల కుంపటి పెట్టాలని చూస్తున్నారా మీ రాజకీయ మనుగడ కోసం ఆంధ్ర క్రికెట్ ను లాగుతారా అని మచ్చా ఆవేదన వ్యక్తం చేశారు

 

👉భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ బీసీసీఐ లో ఎంత మంది రాజకీయ నాయకులు ఉన్నారు మీకు తెలియదా క్రికెట్ కు సంబంధం లేని వాళ్ళు భారత క్రికెట్ లోనే ఉంటే ఆంధ్రాలో ఉన్నారని తప్పని ఎలా చెప్తారు

 

👉ఈరోజు కొత్తగా ఏం ప్రారంభం కాలేదు రఘురామ కృష్ణంరాజు ఎంపీ గారు తెలుసుకోవాలి మీకు అన్ని తెలుసు కానీ అబద్ధాలు మాట్లాడుతున్నారు

 

👉ఆంధ్ర క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తున్న శరత్ చంద్రారెడ్డి, గోపినాథ్ రెడ్డి పై విమర్శలు చేయడం దురదృష్టకరం

 

👉శరత్ చంద్రారెడ్డి రోహిత్ రెడ్డిలు విజయసాయిరెడ్డికి అల్లుళ్లు కావడమే నేరమా విజయ్ సాయి రెడ్డికి బంధుత్వం లేకపోతే ఇంత వివాదం జరిగేది మీరు మాట్లాడే వారేనా క్రికెట్కు సర్వీస్ చేస్తామని వస్తే తప్పేంటి ఇంతవరకు ఆంధ్ర క్రికెట్ లో చాలామంది పారిశ్రామికవేత్తలు పనిచేశారు ఇది కొత్త కాదు పదవులు పొందారు

 

👉కులాల కుంపటి పెట్టిందే మీ కులం వారు అది మర్చిపోతే ఎలాగ ఇది వాస్తవం

 

👉మీ కులం వారు ఆంధ్ర క్రికెట్ లో ఉండగా అనేక మందిని జిల్లా క్రికెట్ అసోసియేషన్ నుంచి అన్యాయంగా దౌర్జన్యంగా తొలగించింది వాస్తవం కాదా చర్చకు సిద్ధమా మీరు నేర్పిందే క్రికెట్ రాజకీయాలు ఆంధ్రాలో ఇది ఆంధ్రాలో ఉన్న క్రికెటర్ లందరికి కూడా తెలుసు మీతో మాట్లాడిస్తున్న వారు కానీ మీరు కానీ చర్చకు సిద్ధమా మీడియా సమక్షంలో అని మచ్చా అన్నారు నేను సిద్ధం ఎప్పుడైనా చర్చకు ఏ టీవీలో అయినా మీరే సమయం నిర్ణయించండి అనవసరంగా క్రికెట్ రాజకీయాలు చేయకు

 

👉మీ ఆధీనంలో క్రికెట్ ఉన్నప్పుడు క్రికెట్ కు సంబంధం లేని వ్యక్తిని కింజాల్ ని ఆంధ్రక్రికెట్ డైరెక్టర్ చేసిన ఘనత మీ వారిదే అది ఒక ట్రైనర్ ని ఇది ఎంత దుర్మార్గం ఎప్పుడు జరగలేదు ఆరోజు ఎవరైనా మిమ్మల్ని మాట్లాడితే వారి మీద చర్యలు తీసుకున్నది వాస్తవం కాదా బొంబాయి వ్యక్తిని ఆంధ్రక్రికెట్ డైరెక్టర్గా చేసిన ఘనత మీది కాదా దీనికి సమాధానం ఎవరు చెప్తారు అని ఎంపీ రాజుని మచ్చా నిలదీశారు

 

👉మరి ఆరోజు ఆంధ్రాలో క్రికెటర్లు ఎవరూ లేరా ఎందుకు నియమించలేదు

 

👉ఇది చరిత్ర ఆంధ్ర క్రికెట్ పరిధిలో సౌత్ జోన్ నార్త్ జోన్ సెంట్రల్ జోన్ మూడు జోన్లు ఉన్నాయి

 

👉ఆంధ్ర క్రికెట్ లో ఎక్కువ కాలం విజయవాడకు చెందిన వ్యక్తులే ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు నార్త్ జోన్ కి సౌత్ జోన్ కి అన్యాయం జరిగింది ఇప్పుడు న్యాయం జరిగింది నార్త్ జోన్ కి అవకాశం వచ్చింది

 

👉క్రికెట్ చరిత్ర సౌత్ జోన్ కి అవకాశం వచ్చింది క్రికెట్ అభివృద్ధి చెందిన తర్వాత ఇదే మొదటిసారి ఆంధ్ర క్రికెట్ శరత్ చంద్రారెడ్డి అరవిందో ఫార్మా అధ్యక్షుడైన తర్వాత ముఖ్యమంత్రితో అత్యంత సన్నిహితంగా ఉంటూ క్రికెట్ అభివృద్ధికి దోహదం చేశారు ఇది వాస్తవం

 

👉శరత్ చంద్రారెడ్డి గోపీనాథ్ రెడ్డి ఇప్పటివరకు కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే పని చేశారు అందులో ఒక సంవత్సరం కరోనాతో వెళ్లిపోయింది రెండు క్రికెట్ సీజన్లో మాత్రమే పని చేశారు బాగా పనిచేయడంతో ఆంధ్ర క్రికెట్ సభ్యులందరూ ఏకగ్రీవంగా మళ్ళీ వారికి అవకాశం ఇచ్చారు ఇందులో తప్పేముంది ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు లోధా నిబంధనలు ప్రకారం ఎన్నికయ్యారు అన్ని చట్ట ప్రకారమే జరిగాయి ఇందులో విజయసాయిరెడ్డి ఎంపీపాత్ర ఎక్కడుంది

 

👉ఇటీవల వరల్డ్ కప్ ఆడిన అండర్ 19 అబ్బాయికి ఎస్సై పోస్ట్ 20 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి ఇప్పించగలిగారు ముఖ్యమంత్రితో మాట్లాడి రషీద్ గుంటూరు అబ్బాయి ఇది క్రికెట్ లో ఒక చరిత్ర

 

👉ఆంధ్ర క్రికెట్ చరిత్రలోమొదటిసారిగా పింఛన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు బీసీసీఐకి అర్హత లేని వారికి రాష్ట్ర క్రికెటర్లకు ఏ సి ఏ పింఛన్లు ఇస్తున్నది ఇది మీకు తెలుసా ఇది ఒక చరిత్ర

 

👉ఇప్పటివరకు ఆంధ్ర క్రికెట్ చరిత్రలో ఒక క్రికెటర్ కు క్రికెట్ ఆడుతుండగానే ఉద్యోగం ఇప్పించింది ప్రస్తుత కార్యవర్గం శరత్ చంద్రారెడ్డి కాదని చెప్పగలరా చెప్పలేరు ఇది వాస్తవం శరత్ చంద్రా రెడ్డి సొంత డబ్బులతో వాళ్ల కంపెనీ ద్వారా రాష్ట్ర టీములకే ఉచితంగా డ్రస్సులు ఇతర సౌకర్యాలు కల్పించారు ఇప్పటివరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో పదవుల్లో ఉన్నవారు ఎవరు సొంత డబ్బులు పెట్టలేదు ఒక్క శరత్ చంద్రారెడ్డి పెట్టారు గుర్తుంచుకోవాలి

 

👉గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహించి శరత్ చంద్రారెడ్డి నాయకత్వంలో అనేకమంది యువ క్రికెటర్లు ఆడడానికి అవకాశం కల్పించారు ఇది ఆంధ్ర క్రికెట్ చరిత్రలో ఒక మేలు రాయి ఇది వాస్తవం కాదా అని మచ్చ రామలింగారెడ్డి ఎంపీ ని ప్రశ్నించారు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు పరిధిలో కేవలం ఐదు రాష్ట్రాల్లో మాత్రమే ఇటువంటి లీగ్ క్రికెట్ పోటీలు జరిగాయి అది మన రాష్ట్రం ఉండడం మనందరికీ గర్వకారణం

 

👉శరత్ చంద్రారెడ్డి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం లో తప్పేముంది గోపీనాథ్ రెడ్డి ప్రధాన కార్యదర్శి నార్త్ జోన్ వారికి అవకాశం రావడం విశాఖపట్నం ప్రాంతానికి చెందిన వ్యక్తికి రావడం ఆంధ్ర క్రికెట్ చరిత్రలో ఇది ఒక రికార్డ్ ఇప్పటివరకు నార్త్ జోన్ వ్యక్తికి ప్రధాన కార్యదర్శి చేసే అవకాశం రాలేదు. అది కేవలం ఇప్పుడే దొరికింది

 

👉ఆంధ్ర క్రికెట్ లో ఒకే కులానికి చెందిన శరత్ చంద్రారెడ్డి రోహిత్ రెడ్డి గోపీనాథ్ రెడ్డి ఉండడం తప్పు ఎలా అవుతుంది అని మచ్చ అన్నారు ఎన్నికల్లో ఎవరైనా గెలవచ్చు

 

👉గతంలో మీ మామ రాజులు లేరా ఇది వాస్తవం కాదా ఆయన కుమారుడు ఆయన ఉండడం నిజం కాదా వాస్తవాలు చెప్పండి ఇతర కులాల వారు కూడా కుటుంబ సభ్యులు జిల్లాలో రాష్ట్ర కమిటీ లో ఉన్నారు ఇది ఒక సాంప్రదాయంగా వస్తుంది ఎవరిది జరిగినప్పుడు వాళ్ళు రాజ్యమేలుతున్నారు మధ్యలో క్రికెట్ క్రీడాకారులు బలి అవుతున్నారు వారి గురించి మాట్లాడండి ఎంతసేపు మీ పదవులు గురించేనా అని ఎంపీని మచ్చా నిలదీశారు

 

👉నేను ఆంధ్రప్రదేశ్ మహిళా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ మహిళా క్రికెట్ ను బాలుర క్రికెట్లో విలీనం చేయగా నన్ను ఎందుకు తీసుకోలేదు మీకు తెలుసా నాకు జరిగిన అన్యాయం నేను ఎవరికీ చెప్పుకోలేదే నాతో పాటు పని చేసిన దేశంలో 16 మంది రాష్ట్ర సెక్రెటరీ బాలుర క్రికెట్ సంఘాలు తీసుకున్నాయి ఒక్క ఆంధ్రాలో తప్ప ఇది ఎంతవరకు న్యాయం మీ కులం కాదని నన్ను దూరంగా పెట్టారు ఇది వాస్తవం ఆంధ్రాలో ప్రతి క్రికెటర్ కు తెలుసు

 

👉సొంత డబ్బులతో మహిళా క్రికెట్అసోసియేషన్లు జిల్లాలలో ఏర్పాటుచేసి కృషి చేసిన వారిని అందరిని మీ రాజు గారే అన్యాయం చేశారు మరి ఆరోజు మేము మౌనంగా లేమా మహిళా క్రికెట్ ని అడ్డం పెట్టుకొని పదవులు పొందింది ఎవరు ఆంధ్ర క్రికెట్లోఅందరికీ తెలుసు

 

👉మహిళా క్రికెట్ మీ హయాంలో పనిచేసిన వారికి జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు క్రికెటర్లకు అన్యాయమైంది క్రికెట్ కోసం పనిచేసిన వారికి అన్యాయం చేశారు మీరు చేసిన అన్యాయం ఇప్పటివరకు ఎవ్వరూ చేయలేదు మీరు ఎంపీగా ఉంది ఇప్పుడు రాజుగారు నీతులు మాట్లాడుతున్నారు ఇదేం పద్ధతి మీకో న్యాయం మాకు ఒక న్యాయం క్రికెటర్లకు న్యాయం చేయండి క్రికెటర్ల గురించి మాట్లాడండి మీ పదవులు గోల ఏంటి

 

👉ఎందుకు మోసం చేస్తారు రాజుగారు ప్రజల్ని మోసగించద్దండి చాముండేశ్వరి నాథ్ ఆంధ్ర క్రికెట్ రంజీ కెప్టెన్ ప్రధాన కార్యదర్శి అయితే జీవితకాలం సస్పెండ్ చేసింది ఎవరు? మీ రాజులు కాదా ఇది క్రికెట్ రాజకీయం కాదా చాముండి కులం వాళ్లని క్రికెట్లో లేకుండా చూడాలని చూసింది రాజులు కాదా ఇదేమంటారు

 

👉ఆంధ్ర క్రికెట్ ఎన్నికలు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జరిగాయి అందులో ఎవరైనా పోటీ చేయొచ్చు మీ కులము మీకు అనుకూలంగా ఉన్న పార్టీలో ఎవరైనా పోటీ చేయొద్దు అన్నారా లేదే మీ రాజులే శరత్ చంద్రారెడ్డిని అధ్యక్షునిగా ఉండాలని వెంకటగిరిక్రికెట్ క్లబ్ నుంచి నామినేట్ చేశారు ఇది వాస్తవం

 

👉మీ రాజులతో ఒకసారి మాట్లాడండి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఆంధ్ర క్రికెట్ ప్రతిష్టను భంగం కలిగించాలని చూస్తే చూస్తూ ఊరుకునే సమస్య లేదు మీకు బుద్ధి చెబుతాం అని మచ్చ రామలింగారెడ్డి అన్నారు

 

👉మీ సొంత ప్రయోజనాల కోసం ప్రచారం కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టను భంగం కలిగించవద్దు క్రికెట్ ని నమ్ముకొని వందలాది మంది క్రికెటర్ ఆడుతున్నారు వారి జీవితాలతో ఆడుకోవద్దండి పద్ధతి మార్చుకోండి అని మచ్చా అన్నారు

 

👉క్రికెటర్లతో గేమ్స్ వద్దు. మీ ఇంటి దగ్గర వచ్చి క్రికెట్ బ్యాటు బాలు ఆడాల్సి ఉంటుంది మహిళా క్రికెటర్లు అందరూ వస్తాము మీ ఇల్లు ముట్టడిస్తాం జాగ్రత్త రాజుగారు మీరు పార్లమెంట్ సభ్యులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీరు మాట్లాడిన పద్ధతి వాడిన భాష కులం మీద మీరు మాట్లాడిన తీరు బాధ కలిగిస్తుంది ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి లేకపోతే న్యాయపోరాటం తప్పదు రాష్ట్రంలోని క్రికెటర్ల నుంచి మీకు తిరుగుబాటు తప్పదు జాగ్రత్త అని మచ్చా రామలింగారెడ్డి హెచ్చరించారు.

 

ఈ కార్యక్రమంలో సీనియర్ క్రికెటర్లు శివ రెడ్డి, రాజశేఖర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

===============

 

*ఆంధ్రప్రదేశ్ వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here