కూడేరులో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు
కూడేరులో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు
-ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రణయ్ రెడ్డి
కూడేరు,AP 39 TV న్యూస్:-
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను కూడేరులో గురువారం వైఎస్సార్ సీపీ నేతలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆ పార్టీ యువజన విభాగం జోనల్ ఇంచార్జ్ వై ప్రణయ్ కుమార్ రెడ్డి విచ్చేశారు. తొలత మహానేత వైయస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. పేదల ఆర్థిక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు . అనంతరం PHCలో రోగులకు బ్రెడ్లు పంపిణీ చేశారు తర్వాత మొక్కలు నాటి ఆయన నీరు పోశారు. కార్యక్రమంలో ఎంపీపీ నారాయణరెడ్డి , వైస్ ఎంపీపీలు సుబ్బమ్మ ,దేవ, పార్టీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి యువజన విభాగం జిల్లా సహాయ కార్యదర్శి విజయ భాస్కర్ రెడ్డి, ట్రేడ్ యూనియన్, జిల్లా సహాయ కార్యదర్శి మంజునాథ రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు సర్దార్ వలి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు శంకర్ నాయక్, సర్పంచ్ రంగారెడ్డి, సంగమేశ్వరాలయ ధర్మకర్త కృష్టప్ప, , ఎంపీటీసీ రమేష్ ,పార్టీ నేతలు మెకానిక్ శంకర్ రెడ్డి, నరేష్ , శంకరయ్య, జితేంద్ర తిమ్మారెడ్డి కృష్ణారెడ్డి, ఆదినారాయణ, రామన్న ,రాజు, శ్రీనివాస్ నాయక్, రమేష్ నాయక్, వేణు, గంగాధర్ నీలకంఠ శివరావు, ఎర్ర నాగప్ప, చంద్రశేఖర్, దేవేంద్ర, రామాంజనేయులు, శ్రీరాములు, శివ, దేవరాజుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు.