కూడేరులో ఘనంగా వాలంటీర్లకు సన్మానం

 

AP39 TV న్యూస్ ,కూడేరు:

కూడేరులో మంగళవారం ఎంపీపీ నారాయణరెడ్డి అధ్యక్షతన “వలంటీర్లకు వందనం” కార్యక్రమంలో భాగంగా సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల సేవలు మరువలేని అన్నారు .నిస్వార్థంతో.. అంకితభావంతో ప్రజలకు సేవలు అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వాలంటీర్లు ప్రజలకు సేవలు అందించడం గర్వించదగ్గ విషయమని ఆయన తెలిపారు. చోళసముద్రానికి చెందిన శివరుద్ర కి ,పి.నారాయణరానికి చెందిన మహాదేవమ్మకు, కూడేరుకు చెందిన ఎర్రిస్వామి, తిమ్మాపురానికి చెందిన ఆక్కులన్న, సరోజమ్మలు సేవా రత్న అవార్డుకు ఎంపికయ్యారు. మరో 200 మంది వాలంటీర్లు సేవా మిత్ర అవార్డును అందుకున్నారు. వారందరికీ విశ్వేశ్వర్ రెడ్డి సాలవాలు కప్పి, మెడల్స్ వేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బెస్త కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రమణ, వైస్ ఎంపీపీలు సుబ్బమ్మ ,దేవా సర్పంచులు ఓబులమ్మ, నాగమ్మ ,ఎంపిటిసి సభ్యుడు రమేష్, వైయస్సార్ సిపి నేతలు తుప్పటి హరీష్ , రామచంద్రారెడ్డి, దేవేంద్ర గంగాధర్ ,ఎంపీడీవో ఎంకే భాషా, డిప్యూటీ తహాసిల్దారు విశ్వనాథ్ ,వైయస్సార్ సిపి నేతలు ,వాలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.