కూడేరులో పాము కాటుతో మహిళ మృతి
కూడేరులో పాము కాటుతో మహిళ మృతి
కూడేరు (అక్టోబర్ 6)AP 39 TV న్యూస్:-
కూడేరులో జోడు లింగాల సంగమేశ్వర స్వామి దేవాలయం వద్ద ఎండోమెంట్ కేటాయించిన గదిలో పూజా సామాగ్రి దుకాణాన్ని నిర్వహిస్తున్న జానకమ్మ ( కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు) శుక్రవారం పాము కాటుతో మృతి చెందింది. తెల్లవారుజామున పాము కాటుకు గురి కాగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.విషయం తెలుసుకున్న మండల , నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ఆమెకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు