కూడేరు సొసైటీలో విరివిగా పంట రుణాలు
-సొసైటీ అధ్యక్షుడు వడ్డే గంగాధర్
AP 39TV ,న్యూస్ కూడేరు:
కూడేరు సొసైటీ బ్యాంక్ లో రైతులకు విరివిగా పంట రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆ సొసైటీ అధ్యక్షుడు వడ్డే గంగాధర్ , డైరెక్టర్లు హనుమంత రెడ్డి , సత్యనారాయణ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. సొసైటీలో మిగిలిన బ్యాంకుల కంటే వడ్డీ తక్కువ అన్నారు. పంట రుణం పై 70 పైసలు మాత్రమే వడ్డీ వర్తిస్తుందన్నారు. రుణం పొందడానికి జామీనుదారు అవసరం లేదన్నారు. పంట రుణం పొందిన రైతులకు పశు పోషణ కింద రూ. 60 వేల రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. ఏల్ టీ లోన్ తీసుకొని మొండి బకాయిగా మారిన రైతులకు వన్ టైం సెటిల్మెంట్ కింద రుణ మాఫీ చేయడానికి బ్యాంకు ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులు మేరకే సొసైటీ నూతన కమిటీ ఎంపిక జరిగిందన్నారు. మాజీ అధ్యక్షుడు నాగేంద్ర ప్రసాద్ ఆరోపిస్తున్నట్లు ఎలాంటి లోగుట్టు లేదన్నారు. ఆయన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని వారు తెలిపారు. సమావేశంలో బ్యాంకు సిబ్బంది శివ , పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు