*‘జగనన్న సురక్ష’ చారిత్రాత్మకం*
– ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేశాం
– రాష్ట్ర వ్యాప్తంగా 57.30 లక్షల మంది సర్టిఫికెట్లు
– ఈనెలాఖరు వరకు ‘జగనన్న సురక్ష’ క్యాంపులు
– ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ
– సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచన
అనంతపురం, జూలై 20 :
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఇది చారిత్రాత్మకమైన కార్యక్రమమని అభివర్ణించారు. ప్రజలకు ఉచితంగా 11 రకాల సేవలను అందిస్తున్నామని చెప్పారు. నగరంలోని యువజన కాలనీ, హమాలీ కాలనీ, రాజీవ్ కాలనీ, నారాయణపురంలో గురువారం ‘జగనన్న సురక్ష’ క్యాంపులు నిర్వహించారు. లబ్ధిదారులకు వివిధ ప్రభుత్వ సేవలకు సంబంధించి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని అన్నారు. అర్హత ఉండి వివిధ కారణాలతో రాకపోతే మళ్లీ వాటిని సరిదిద్ది పథకాల ప్రయోజనాలను అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడం కోసమే ‘జగనన్న సురక్ష’ క్యాంపులను జూలై 1వ తేదీ నుంచి నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన వస్తోందని, ఇప్పటి వరకు ఏకంగా 1 కోటి 5 లక్షల కుటుంబాలను సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, గృహసారథులు, ప్రజాప్రతినిధులు కలిశారని చెప్పారు. 18 రోజుల వ్యవధిలోనే 57 లక్షల 30 వేల మందికి వివిధ ప్రభుత్వ సేవలకు సంబంధించి సర్టిఫికెట్లు అందజేశామన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ సేవలను అందించిన దాఖలాలు లేవని చెప్పారు. ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో దీన్ని బట్టి అర్థమవుతుందని అన్నారు. సీఎం జగన్ ప్రజలకు మంచి చేస్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో వారికి తగిన గుణపాఠాన్ని ప్రజలే చెబుతారని అన్నారు. జూలై నెలాఖరు వరకు ‘జగనన్న సురక్ష’ క్యాంపులు జరుగుతాయని, ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గిరిజమ్మ, నగర మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్ రమణారెడ్డి, జేసీఎస్ కన్వీనర్లు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, చింతకుంట మధు, కార్పొరేటర్లు గోగుల లక్ష్మిదేవి, రహంతుల్లా, దుర్గాదేవి, వి.మీనాక్షి, ఎం.నరసింహులు, కమల్ భూషణ్, సర్పంచ్ ఆశాబీ, జెడ్పీటీసీ చంద్ర, ఎంపీపీ వరలక్ష్మి, ఎంపీటీసీలు సంధ్య, నాగేంద్ర, శ్రుతి, హాజివలి, బీసీ సెల్ రీజనల్ కో ఆర్డినేటర్ రమేష్‌గౌడ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, గృహ సారథులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.