జల్లిపల్లి లో సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ ప్రారంభం

జల్లిపల్లి లో సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ ప్రారంభం

AP 39 TV న్యూస్ ,కూడేరు:

కూడేరు మండల పరిధిలోని జల్లిపల్లి లో గురువారం సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు .ఈ కార్యక్రమానికి వైయస్సార్ సిపి నేతలు దేవేంద్ర ,బైరెడ్డి రామచంద్రారెడ్డి , రమేష్ నాయక్ ,కొత్త కాపు సిద్ధారెడ్డి , ముఖ్య అతిథులుగా విచ్చేసి విత్తన పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారన్నారు. ఈ సబ్సిడీ విత్తన వేరుశనగ కాయలను రైతులు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని వారు సూచించారు. కార్యక్రమంలో మండల ఏఓ విజయ్ కుమార్ ఎంపీఈఓ జయప్రకాష్ ,పార్టీ నేతలు వెంకటేష్ ,హనుమంతు, మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

పవన్ Kumar

Kuderu

రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.