పదిలో అత్యధిక మార్కులు సాధించిన కూడేరు హై స్కూల్ విద్యార్థి

పదిలో అత్యధిక మార్కులు సాధించిన కూడేరు హై స్కూల్ విద్యార్థి

 

కూడేరు ఏప్రిల్ 22 (AP 39 TV న్యూస్):-

 

పదవ తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అందులో కూడేరు హైస్కూల్ కు చెందిన విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి మండల టాపర్లుగా నిలిచారు. వారిలో గోవర్ధన్ రెడ్డి 578, పూజ శ్రీ 567 ,హర్షిత 545 మార్కులు సాధించారు. 319 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 224 మంది ఉత్తీర్ణత సాధించినట్లు మండల విద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. పాఠశాలల వారీగా ఫలితాలు వివరాలు ఇలా ఉన్నాయి.. కమ్మూరు హైస్కూల్లో 31 మంది పరీక్ష రాయగా 10 మంది ఉత్తీర్ణత సాధించారు .అలాగే కోడేరు స్కూల్లో 99 మందికి 71 మంది , జల్లిపల్లి హైస్కూల్లో 68 కి 52 మంది ,మరుట్ల హైస్కూల్లో 24 మందికి 18 మంది ,కొర్రకోడు హైస్కూల్లో 21 కి 13 మంది ,కరుట్లపల్లి హైస్కూల్లో 38 కి 25 మంది, కేజీబీవీ లో 38 కి 35 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు. మండల ప్రథమ ద్వితీయ తృతీయ టాపర్లుగా కూడేరు హైస్కూలు విద్యార్థులు నిలవడంతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి ఆయా విద్యార్థులకు అభినందించారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.