పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం
–ఎంపీపీ నారాయణరెడ్డి
కూడేరు,మార్చి 3 (AP 39 TV న్యూస్):-
పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు అందరూ కృషి చేద్దామని ఎంపిపి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన కూడేరులో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కేంద్రానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల లోపు పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.. మండల వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమాన్ని అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ అనుపమ జేమ్స్ తనిఖీ చేశారు. పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో డాక్టర్లు లక్ష్మీనారాయణ, సౌమ్యారెడ్డి, సర్పంచులు ,ఎంపీటీసీ సభ్యులు, సూపర్వైజర్ రవీంద్ర,,MLHP లు, ANM లు, హెల్త్ అసిస్టెంట్ రమేష్ ,వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు