వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్ప నిసరిగా పాటించాలి – ఎస్ఐ సత్యనారాయణ
వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్ప నిసరిగా పాటించాలి
– ఎస్ఐ సత్యనారాయణ
AP 39 TVన్యూస్ కూడేరు:
వాహనదారులు తప్పని సరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని ఎస్ఐ సత్యనారాయణ సూచించారు. శనివారం సాయంత్రం కూడేరులో వాహనదారులకు “రోడ్డు ప్రమాదాల నివారణ” పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన తలకు దెబ్బ తగలకుండా రక్షణ పొంద వచ్చన్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రాణానికి ముప్పు అని హెచ్చరించారు. మలుపుల వద్ద, వాహనాల రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో నిదానముగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ రామానాయుడు, కానిస్టేబుల్స్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: పవన్ కుమార్
కూడేరు.