సర్పంచ్ చేతుల మీదుగా విత్తన వేరుశనగ పంపిణీ
సర్పంచ్ చేతుల మీదుగా విత్తన వేరుశనగ పంపిణీ
AP 39 TV న్యూస్ , కూడేరు:
కూడేరు మండల పరిధిలోని కమ్మూరులో శనివారం సర్పంచ్ రంగారెడ్డి చేతుల మీదుగా సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అన్నారు .రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకు వచ్చి రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు .రైతులు ఈ సబ్సిడీ విత్తన వేరుశనగను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో విలేజ్ అగ్రి అసిస్టెంట్ నరేష్ ,రైతులు పాల్గొన్నారు.
రిపోర్టర్ పవన్ కుమార్
కూడేరు