నాలుగేళ్ల తర్వాత రాజకీయంలోకి రీఎంట్రీ ఇచ్చిన రఘువీరా.

నాలుగేళ్ల తర్వాత రాజకీయంలోకి రీఎంట్రీ ఇచ్చిన రఘువీరా…….

AP 39TV NEWS ఏప్రిల్ 18

గుడిబండ:- మడకశిర నియోజకవర్గంలో దాదాపు రెండు దశాబ్దాల కాలం కాంగ్రెస్ కంచుకోటలో చక్రం తిప్పిన రఘువీరా…. మాజీ ముఖ్యమంత్రిలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డి రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లలో పనిచేసిన అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి రఘువీరా రెడ్డి దాదాపు నాలుగు సంవత్సరాలు రాజకీయంగా విరామం తీసుకుని తన స్వగ్రామంలో వ్యవసాయం పనులు చేసుకుంటూ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం మరియు పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయాల నిర్మాణంలో చాలా బిజీ బిజీగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత మంగళవారం మడకశిర నీలకంఠ కోల్డ్ స్టోరేజ్ లో భారీ అభిమానుల ఆధ్వర్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య కాంగ్రెస్ పార్టీ కండువా తన భుజంపై వేసుకోవడంతో ఆయన భావోద్వేగంతో మాట్లాడుతూ భారత దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అనేకమైన ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో సహాయం చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే భారతదేశంలో ఏకైక పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీనని తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని విడే ప్రసక్తే లేదని ప్రస్తుతం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ అవలంబిస్తున్న పనితీరును ఎండగట్టారు స్వాతంత్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబంలో ఏకైక మహిళ ప్రధానమంత్రి మనవడు రాహుల్ గాంధీ పై లేనిపోని ఆబాండాలు మోపుతూ రాజ్యసభ సభ్యత్వం రద్దు చేస్తూ ఆయనకున్న భద్రత సిబ్బందిని తొలగిస్తూ ఆయనకు కేటాయించిన రాజభవన్ లో తన ఇంటిని ఖాళీ చేయించడమే కాకుండా వ్యక్తిగతంగా ఆయనను దూషిస్తూ అవమానాలకు గురి చేస్తున్నారు. బిజెపి రాజకీయ కుళ్ళు కుతంత్రాలను చూస్తూ ఉండలేకపోతున్నానని అందుకే భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అనేకమైన సంస్కరణలు దేశ ప్రజల కోసం చేసిన ప్రత్యేకమైన కార్యచరణలను గుర్తు చేసుకుంటూ మరోసారి నా వంతుగా రాహుల్ గాంధీకి అండగా ఉండాలనే సంకల్పంతోనూ మరియు నన్ను అభిమానించే ప్రతి ఒక్కరి కోసం నేను మరోసారి రాజకీయంగా రీఎంట్రీ చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండువాను తన భుజ స్కందాలపై మోస్తూ మడకశిర. కళ్యాణదుర్గం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై అభిమానుల కోరిక మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేస్తానని ఆయన తెలిపారు అలాగే త్వరలోనే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నాతోపాటు దాదాపు గత 30 సంవత్సరాలుగా పనిచేసిన వ్యక్తులను మరియు మడకశిర నియోజకవర్గంలో ఉండే తన అభిమానుల ఆధ్వర్యంలో మరోసారి మీ అందరిని ఒకచోటకు చేర్చి ఒక మంచి నిర్ణయం తీసుకొని యధావిధిగా రాజకీయం చేద్దామని ఇప్పటికే తనతో నడిచేందుకు చాలామంది ఒత్తిడి చేస్తున్నారని అందుకు నేను మీ అందరికీ మీడియా ముఖంగా తెలుపది ఏమంటే త్వరలోనే ప్రతి ఒక్కరిని కలుస్తాను ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తీసుకుని నేను ప్రతి ఒక్కరితో మరోమారు చర్చించి తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుందామని ఆయన పేర్కొన్నారు అలాగే ప్రస్తుతం సమీప రాష్ట్రమైన కర్ణాటక సార్వత్రిక ఎన్నికల్లో నాకు బెంగళూరు మహానగరంలో ఎన్నికల పరిశీలకుడుగా ఏఐసీసీ నియమించినందుకు త్వరలోనే బెంగళూరులో పార్టీ కేటాయించిన అభ్యర్థుల గెలుపుకు శాయ శక్తులకు మించి పనిచేసి నాకు అప్పగించిన బాధ్యతను పూర్తిస్థాయిలో పార్టీ కోసం ఉపయోగిస్తున్నాని తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన పావవడ. మధుగిరి. సిరా. కొరటగేర. నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తానని వెల్లడించారు. అలాగే మడకశిర.కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రజలకు గత 50 సంవత్సరాలుగా ఏ నాయకుడు చేయని విధంగా అభివృద్ధి చేసి చూపించానని త్వరలోనే కళ్యాణదుర్గం పెనుగొండ మడకశిర హిందూపురం నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరలోనే ప్రతి ఒక్కరితో చర్చించి రాజకీయ విశ్లేషకుల ద్వారా ఒక మంచి నిర్ణయం తీసుకొని రాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిష్టాత్మకమైన పార్టీగా వ్యక్తులుగా ఎదగదామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రఘువీరా తోపాటు మాజీ ఎమ్మెల్యే హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు సుధాకర్ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త కేటీ శ్రీధర్ మడకశిర మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంగలవాయి ప్రభాకర్ రెడ్డి నరసింహమూర్తి. ఈశ్వరప్ప. బూదిపల్లి నాగభూషణ్. సొరంగాల నాగరాజు. మడకశిర మండల కన్వీనర్ టీవీఎస్ షోరూం మంజునాథ గుడిబండ మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మందలపల్లి నాగరాజు అమరాపురం మండల కన్వీనర్ గురుమూర్తి రొల్ల గౌడప్ప మరియు ఐదు మండలాల మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ సింగల్ సింగల్ విండో డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ అభిమానులు రఘువీరారెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కొంకల్లు శివన్న

రిపోర్టర్

AP 39TV

మడకశిర ఆర్సి ఇంచార్జ్

గుడిబండ

Leave A Reply

Your email address will not be published.