సాంప్రదాయ ఆటలతో.. సంక్రాంతిని సంతోషంగా జరుపుకోండి
-ఎస్ఐ సత్యనారాయణ
కూడేరు,AP 39 TV న్యూస్:-
సంక్రాంతి పండుగను కూడేరు మండల ప్రజలు సాంప్రదాయ ఆటలతో ..సంతోషంగా జరుపుకోవాలని ఎస్ఐ సత్యనారాయణ సూచించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంక్రాంతిని పురస్కరించుకొని గ్రామాల్లో ఎక్కడైనా సరే కోడి పందేలు ,పేకాట వంటి ఆటలాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పేకాట, కోడిపందాలతో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. తద్వారా కుటుంబంలో కూడా ఆర్థిక ఇబ్బందులతో గొడవలు చోటు చేసుకుంటాయని ఆయన సూచించారు. మీరు చేసే అసాంఘిక కార్యకలాపాలతో మీ కుటుంబ సభ్యులు బాధపడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఎక్కడైనా కోడి పందేలు పేకాట ఆడుతున్నట్లు తెలిస్తే 9440796814 నంబర్కు లేదా 100, 112 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వాలని మీ పేర్లు బయట పెట్టమని ఎస్సై తెలిపారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు