అభివృద్ధి పథంలో ఎంఎంహల్లి
అభివృద్ధి పథంలో ఎంఎంహల్లి
-ఎంపీపీ నారాయణరెడ్డి
కూడేరు (సెప్టెంబర్ 30)AP 39 TV న్యూస్:-
YSR CP అధికారంలోకి వచ్చాక కూడేరు మండల పరిధిలోని ఎంఎం హల్లి గ్రామం అభివృద్ధి పథంలో నడుస్తోందని ఎంపీపీ నారాయణరెడ్డి అన్నారు. శనివారం గ్రామంలో జగనన్న శాశ్వత భూహక్కు -భూ రక్ష కార్యక్రమం లో భాగంగా రైతులకు పత్రాల పంపిణీ జరిగింది .కార్యక్రమానికి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి విచ్చేశారు .ఈ సందర్భంగా ఎంపీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎంఎం హల్లి మండలంలోని మారుమూలు గ్రామం అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన ఈ గ్రామ రూపురేకులు మారలేదన్నారు .కానీ ysrcp అధికారం చేపట్టాక ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి సహకారంతో గ్రామంలో సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది .అదేవిధంగా సిద్ధరాంపురం మీదుగా ఆత్మకూరుకు సుమారు రూ. రెండు కోట్లతో రోడ్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాడు నేడుతో బడుల ను అభివృద్ధి పరిచామన్నారు.. ప్రజలు గ్రామంలో జరిగిన అభివృద్ధిని గుర్తుపెట్టుకుని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డికి మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు