అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అసత్య ఆరోపణలు
-కొర్రకోడు సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్
కూడేరు (అక్టోబర్ 18)AP 39 TV న్యూస్:-
కూడేరు మండలం కొర్రకోడు పంచాయతీ లో ఉరవకొండ మాజీ ఎమ్మెల్యేవిశ్వేశ్వర రెడ్డి ,ఎంపీ తలారి రంగయ్య, ఎంపీపీ నారాయణరెడ్డి జడ్పీటీసీ సభ్యురాలు తుప్పటి అశ్విని , గ్రామ ప్రజల సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్ బుధవారం తెలిపారు. కానీ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే టీడీపీ నేతలు తమ ఉనికిని కోల్పోతామని భయంతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని సర్పంచ్ మండిపడ్డారు. తన సొంత మోటర్ ను ప్రజల కి ఇబ్బంది లేకుండా పంచాయతీ కి అవసరం ఐనప్పుడల్లా వాడటం జరిగేది .ఇది టీడీపీ వాళ్లకి కూడా తెలుసన్నారు. కానీ వారి పార్టీ మనుగడ కోసం దిగిజారి ప్రవర్తిస్తున్నారు.మీరు దిగజారి అభివృద్ధి ని అడ్డుకుంటే పుట్టగతులు లేకుండా పోతారని అన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు