ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్ కృష్ణ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

*ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్ కృష్ణ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం !*

*బాధ్యలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి.*

*భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసు ఉన్నతాధికారులు చూడాలి.*

రాప్తాడు వద్ద నిర్వహించిన సిద్ధం భహిరంగ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైకాపా మూకలు దాడి చేయడం అత్యంత దుర్మార్గపు చర్య..ప్రజాస్వామ్య వాదులు ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండించాలి. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలి. పోలీసులు కేసు నమోదు చేసి నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని

ఫోటోగ్రాఫర్ పై దాడి చేయడం సమర్థనీయం కాదు , జర్నలిస్టుగా తమ వృత్తి ధర్మంలో భాగంగా రాజకీయ బహిరంగ సభలలో పాల్గొంటుంటారు. జర్నలిజం వారి వృత్తి , దానిని రాజకీయ కోణంలో చూడడం సరికాదు . పని చేసే ఉద్యోగులపై దాడి చేయడం ఏ మాత్రం మంచిది కాదు. భవిష్యత్ లో ఇలాంటి దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ పై ఉందన్నారు. మచ్చ రామలింగారెడ్డి అన్నారు

ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛపై దాడినిAP 39TV తీవ్రంగా ఖండిస్తోంది. దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ 39 టీవీ యాజమాన్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులు పైన కూడా ఉంది. ప్రజాస్వామ్యంలో మీడియా గొంతు నొక్కాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదు.

ఇట్లు

AP 39TV యాజమాన్యం

Leave A Reply

Your email address will not be published.