ఆడుదాం ఆంధ్ర”టోర్నీ క్రికెట్ విజేత ఉదిరిపికొండ జట్టు

ఆడుదాం ఆంధ్ర”టోర్నీ క్రికెట్ విజేత ఉదిరిపికొండ జట్టు

 

కూడేరు(AP 39 TV న్యూస్):-

గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి రాష్ట్రస్థాయిలో గుర్తింపు కలిగించాలన్న ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం “ఆడుదాం ఆంధ్ర” పేరిట క్రీడా పోటీలను నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా శనివారం కూడేరు మండలం కమ్మూరు వద్ద మండల స్థాయి క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. ఇప్పేరు సచివాలయ జట్టుపై ఉదిరిపికొండ సచివాలయ జట్టు విజయం సాధించింది. విజేత జట్టు క్రీడాకారులను ఎంపీపీ నారాయణ రెడ్డి, ఎంపీడీవో నాగభూషణ్ రెడ్డి అభినందించారు. వారికి టోర్నీ కప్పు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చిన్న రంగారెడ్డి, పీడీలు, అక్కులప్ప, నరసింహులు ,పంచాయతీ కార్యదర్శి రఘు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి , ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి మంజునాథ్ రెడ్డి,జెఎసి మండల కన్వీనర్ దేవేంద్ర, సింగల్ విండో ప్రెసిడెంట్ గంగాధర్, నాయకులు సిద్ధారెడ్డి, రామ్మోహన్, రమేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కుడేరు

Leave A Reply

Your email address will not be published.