ఆడుదాం ఆంధ్రాని విజయవంతం చేయండి
ఆడుదాం ఆంధ్రాని విజయవంతం చేయండి
-ఎంపీడీవో ఎంకే బాషా
కూడేరు,AP 39 TV న్యూస్:-
ఈనెల 26 నుంచి నిర్వహించే “ఆడుదాం ఆంధ్ర” క్రీడా పోటీలను విజయవంతం చేయాలని ఎంపీడీవో ఎం.కె బాషా కోరారు. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల అవగాహన ర్యాలీని శుక్రవారం కూడేరులో నిర్వహించారు. తర్వాత బస్టాండ్ లో మానవహారం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 26 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఈ పోటీలు అన్ని సచివాలయ పరిధిలో ,మండల , నియోజకవర్గ , జిల్లా స్థాయిలో జరుగుతాయన్నారు.. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తోందన్నారు .కాబట్టి గ్రామీణ ప్రాంత క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభ కనబరచాలని ఆయన సూచించారు .కార్యక్రమంలో ఎంఈఓ చంద్రశేఖర్ , పీడీలు ఆక్కులప్ప ,రుక్మిణి ,రిజ్వాన, అంజినాబాయి ,పంచాయతీ కార్యదర్శి రఘు ,హై స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు