అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు

అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవు

-ఎస్ఐ సత్యనారాయణ

కూడేరు(AP 39 TV న్యూస్):-

కూడేరు మండలంలో ఎక్కడైనా అక్రమంగా మద్యం విక్రయించిన.. నాటు సారా తయారు చేసిన అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం మండల పరిధిలోని పి. నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఆయన తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు .ఈ సందర్భంగా సూరప్ప అనే వ్యక్తి ఇంట్లో కర్ణాటక మధ్యాన్ని గుర్తించారు. మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకుని, అతనిని అరెస్టు చేశారు .కార్యక్రమంలో కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.