సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

-ముఖ్య అతిథిగా పాల్గొన్న బిగ్ బాస్ 7 షో రన్నర్ అమర్ దీప్

 

కూడేరు,AP 39 TV న్యూస్:-

కూడేరు మండల పరిధిలోని లెప్రసీ కాలనీలో బుధవారం సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు బిగ్ బాస్7 షో రన్నర్ అమర్ దీప చౌదరి, తేజస్విని దంపతులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అమర్ డీప్ కేక్ కట్ చేశారు.ఆయన మాట్లాడుతూ మతం కన్నా మానవత్వం ముఖ్యమన్నారు.మానవత్వం తో మనిషి ఉన్నత స్థానం కు వెల్లగలడన్న విషయాన్ని యేసు ప్రభువు నిరుపించారన్నారు. అనంతరం సాయి ట్రస్ట్ తరపున వృద్ధులకు దుప్పట్ల పంపిణి చేశారు. సాయి ట్రస్ట్ అద్యక్షుడు విజయసాయి కుమార్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో అన్ని పండుగలను జరుపుతామన్నారు. మతాలు వేరైనా అన్ని మతాల సారాంశం ఒక్కటేనన్నారూ.కార్యక్రమం లో సాయి ట్రస్ట్ సిబ్బంది రాఘవేంద్ర,నారాయణ నాయక్, యుట్యుబర్ ప్రవీణ్, అమరనాథ్ తదితరలు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.