ఘనంగా జాగృతి ఆదర్శ స్కూల్ యాన్యువల్ డే వేడుకలు
ఘనంగా జాగృతి ఆదర్శ స్కూల్ యాన్యువల్ డే వేడుకలు
కూడేరు,మార్చి 25 (AP 39 TV న్యూస్):-
కూడేరులోని జాగృతి ఆదర్శ విద్యాలయంలో ఆదివారం స్కూల్ యాన్యువల్ డే వేడుకలను ఆ పాఠశాల యాజమాన్యం ఘనంగా జరుపుకుంది .వేడుకలకు ప్రైవేటు పాఠశాలల యూనియన్ జిల్లా అధ్యక్షులు పుల్లారెడ్డి ,డాక్టర్ సుభాషిణి , రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. విద్యార్థులు చేసిన నృత్యాలు.. వేసిన స్టెప్పులు అందరిని అబ్బురపరిచాయి. చెట్లు నరకడం ద్వారా కలిగే నష్టాలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో కలిగే అనర్థాలు ,వాతావరణం కలుషితం కావడంతో కలిగే ఇబ్బందులును విద్యార్థులు నాటక రూపంలో ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంది.ఈ సందర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ ఈ సందర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాల యాజమాన్యం తక్కువ ఫీజుతో పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం గర్వించదగ్గ విషయమన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ శిరీష మాట్లాడుతూ పేద పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించాలన్నదే మా పాఠశాల ముఖ్య ఉద్దేశం అన్నారు. అందుకోసమే మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక స్తోమెతకు తగ్గట్టు ఫీజులను నిర్ణయించి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన చేయించడం జరుగుతోందన్నారు. పిల్లలు ప్రదర్శించిన నాటకాలు చేసిన ముత్యాలను చూసి వారి తల్లిదండ్రులు మురిసిపోయారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పురుషోత్తం ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు