అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం ఉండరాదు

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం ఉండరాదు

*: జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి*

అనంతపురం, ఫిబ్రవరి 19 :

*అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి అర్జీలను స్వీకరించారు.*

 

*ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, సమగ్ర శిక్ష ఏపిసి వరప్రసాద్, డీఆర్డీఏ పిడి నరసింహా రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 254 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించడం జరిగింది.*

 

*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం, స్పందన అర్జీల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని అధికారులను ఆదేశించారు. అర్జీలను సకాలంలో నాణ్యతగా పరిష్కరించాలన్నారు. పెండింగ్ ఉంచకుండా, రీఓపెన్ కాకుండా అర్జీదారున్ని సంప్రదించి వారు సంతృప్తి చెందేలా అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలన్నారు. గడువులోపు అర్జీలను నిత్యం మానిటర్ చేస్తూ పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖల జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.*

 

*ఈ కార్యక్రమంలో సిపిఓ అశోక్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, ఎల్డిఎం సత్యరాజ్, డీపీఓ ప్రభాకర్ రావు, డిసిహెచ్ఎస్ డా. పాల్ రవికుమార్, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా.కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వరరావు, సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్ రావు, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రసూల్, హార్టికల్చర్ డిడి రఘునాథ రెడ్డి, ఏపీఎంఐపి పిడి ఫిరోజ్ ఖాన్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేంద్ర, డిఎస్ఓ శోభారాణి, వెప్మా పీడీ విజయలక్ష్మి, బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఇహషాన్ బాషా, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఎడి రూప్లనాయక్, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, హెచ్ఎల్సి ఎస్ఈ రాజశేఖర్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*

 

Leave A Reply

Your email address will not be published.