చిట్టి చేతులు ..అద్భుతాలు సృష్టించాయి
చిట్టి చేతులు ..అద్భుతాలు సృష్టించాయి
-ఆర్డిటి ఆర్ట్స్ ఫెస్టివల్ అదుర్స్
కూడేరు (అక్టోబర్ 19)AP 39 TV న్యూస్:-
దివ్యాంగ చిన్నారుల చిట్టి చేతులు అద్భుతాలు సృష్టించాయి . సకలాంగులకు తామేమి తీసుపోమని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వివరాల్లోకి వెళితే …కూడేరులోని ఆర్డిటి సెరబ్రల్ పాలసీ సెంటర్ లో ఆర్డిటి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఆర్ట్స్ ఫెస్టివల్ అదుర్స్ అనిపించింది. ఈ కార్యక్రమంలో కదిరి, బుక్కరాయసముద్రం , అనంతపురం ,బత్తలపల్లి, ఉరవకొండ ,కనేకల్ ,కూడేరు సెంటర్లకు చెందిన దివ్యాంగ చిన్నారులు మొత్తం 17 టీములు పాల్గొన్నాయి. పేపర్ అట్టముక్కలతో ,బంక మట్టితో చేసిన బొమ్మలు, మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలి అనే దానికి సంబంధించిన బొమ్మలు, ప్రకృతిలో లభించే వివిధ రకాల వస్తువులతో ఏర్పాటు చేసిన బొమ్మలు, అందరిని ఆకట్టుకున్నాయి. అదేవిధంగా వివిధ రకాల రంగులతో వేసిన ముగ్గులు అందరినీ ఆకర్షించాయి. ఈ సందర్భంగా డి ఐ డి సెక్టార్ డైరెక్టర్ జులేఖ, కూడేరు సెంటర్ మేనేజర్ షణ్ముఖ మాట్లాడారు. దివ్యాంగ పిల్లల్లో నైపుణ్యాన్ని వెలికి తీయడానికే ఈ ఫెస్టివల్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన మూడు టీములను నవంబర్ 14న అనంతపురంలో జరిగే సకలాంగుల పోటీల కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సిబ్బంది గీతా తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు