అతి వేగం ప్రమాదకరం సిఐ శేఖర్
అతి వేగం ప్రమాదకరం సిఐ శేఖర్
AP 39TV న్యూస్ కూడేరు:
అతి వేగం ప్రమాదకరమని ఉరవకొండ రూరల్ సీఐ శేఖర్ పేర్కొన్నారు .శుక్రవారం ఎస్ఐ సత్యనారాయణ సిబ్బందితో కలిసి ఆయన కూడేరు మండల పరిధిలోని అరవకూరు, శివరాంపేట ,జల్లిపల్లి , బ్రాహ్మణపల్లితో పాటు మరికొన్ని గ్రామాల వద్ద బ్లాక్ స్పాట్ ప్రాంతాలను పరిశీలించారు .ఆయా ప్రాంతాల్లో ప్రమాద సూచిక బోర్డులు ,బ్లాక్ స్పాట్ బోర్డులను ఏర్పాటు చేయించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటిస్తూ నిదానంగా వెళితే సురక్షితంగా గమ్యాన్ని చేరుకుంటారన్నారు. ప్రమాద స్థలాల వద్ద వాహందారులు నిదానంగా వెళ్లాలని తెలియజేశారు. కార్యక్రమంలో కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు.