త్యాగానికి ప్రతీక బక్రీద్
●ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.
త్యాగం, సహనం, ఐకమత్యానికి ప్రతీకగా బక్రీద్ నిలుస్తోందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం స్ఫూర్తితో ప్రజలు సత్యం, న్యాయం, ధర్మం, త్యాగం, సహనం, పరోపకారం, బాధ్యతాభావం అలవరచుకోవాలని ఆయన కోరారు. దేవుడి దయతో ప్రజలందరూ ఆరోగ్యాలు, సుఖ శాంతులుతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లాలో ఎల్లప్పుడూ మత సామరస్యం వెల్లివిరియాలన్నారు. బక్రీదు సందర్బంగా ముస్లిం సోదరులకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.