కూడేరులో బీమా పథకాలపై అవగాహన
కూడేరులో బీమా పథకాలపై అవగాహన
AP 39 TV న్యూస్ కూడేరు:
కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలపై శనివారం కూడేరు లోని స్టేట్ బ్యాంకు వద్ద ప్రజలకు అవగాహన సదస్సును నిర్వహించారు .ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ మేనేజర్ నాగరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీవన్ జ్యోతి ,సురక్ష బీమా యోజన పథకాలను అమలులోకి తీసుకు వచ్చిందన్నారు. స్టేట్ బ్యాంకు ఖాతాదారులైన వారు ఈ పథకాలను లబ్ధి పొందడానికి అర్హులన్నారు .జీవన్ జ్యోతి పథకం కింద ఏడాదికి రూ.436 చెల్లించాలన్నారు .సహజ మరణం పొందిన 2 లక్ష రూపాయలు వర్తిస్తుందన్నారు. అదే సురక్ష బీమా పథకానికైతే ఏడాదికి 20 రూపాయలు చెల్లించాలన్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందితే 2 లక్ష రూపాయలు బీమా వర్తిస్తుందన్నారు. అదేవిధంగా అంగవైకల్య బీమా సదుపాయం కూడా ఉంటుందన్నారు. కాబట్టి ప్రజలు ఈ బీమా పథకాలను సద్వినియం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది ,బీసీ పాయింట్ నిర్వాకుడు వెంకటేష్ పాల్గొన్నారు.
రిపోర్టర్: పవన్ కుమార్
కుడేరు