బీరప్ప దేవుని మాన్యానికి రక్షణ కల్పించండి
బీరప్ప దేవుని మాన్యానికి రక్షణ కల్పించండి
AP 39TV,న్యూస్ కూడేరు:
అనంతపురం జిల్లా
కూడేరు మండలం
తిమ్మాపురం గ్రామ పొలం సర్వేనెంబర్ 246కో గల 29.46 ఎకరాల భూమి బీరప్ప స్వామిది. కానీ
పూజారులు అన్యాక్రాంతం చేసి ఆక్రమించు కోవాలని చూస్తున్నారు. పోలీస్ ప్రొటెక్షన్ కల్పించి పూజారుల దౌర్జన్యానికి అడ్డుకట్ట వేయాలని సోమవారం జిల్లా కేంద్రం లో జరిగిన స్పందన కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ కురుబలు అర్జీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అక్కులప్ప, బాలరాజు, రామాంజనేయులు, మల్లికార్జున, వెంకట్రాముడు, ఉజ్జినయ్య, కమ్మే రామాంజనేయులు, బండి హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు