రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రమణ ప్రసాద్ కు ఘనంగా సన్మానం

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రమణ ప్రసాద్ కు ఘనంగా సన్మానం

 

కూడేరు (సెప్టెంబర్ 16)AP 39TV న్యూస్:-

కూడేరు మండలం పి. నారాయణపురం ప్రైమరీ స్కూల్ హెచ్ఎం రమణ ప్రసాద్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న విషయం విధితమే. అవార్డు గ్రహీతకు శనివారం కూడేరు లోని ఎమార్సీ సెంటర్ లో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారులు చంద్రశేఖర్, సాయికృష్ణాలు ముఖ్య అతిథులుగా హాజరై ఆయనను సన్మానించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకితభావంతో సేవలందిస్తే తగిన గుర్తింపు లభిస్తుంది అన్నారు .అందుకు నిదర్శనం రమణ ప్రసాద్ అన్నారు .ఆయనకి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం కూడేరు మండలానికి గర్వకారణమన్నారు. ఉపాధ్యాయులు అవార్డుకు అభినందనలు తెలియజేశారు కార్యక్రమంలో సి ఆర్ పి లు ఎమ్మార్పీ సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

తమ్మిశెట్టి పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.