సమగ్ర భూ రీ సర్వే దేశంలోనే రికార్డ్

సమగ్ర భూ రీ సర్వే దేశంలోనే రికార్డ్

-ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి

-ఎంఎం హళ్లిలో “జగనన్న శాశ్వత భూ హక్కు పత్రాల” పంపిణీ

కూడేరు (సెప్టెంబర్ 30)AP 39 TV న్యూస్:-

జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం ద్వారా రాష్ట్రంలో అత్యాధునిక పరికరాలతో చేపడుతున్న సమగ్ర భూ రీసర్వే దేశంలోనే ఓ రికార్డుగా నిలుస్తుందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కూడేరు మండల పరిధిలోని ఎంఎం హళ్లిలో సర్పంచ్ హనుమంత రెడ్డి అధ్యక్షతన భూ హక్కు పత్రాల పంపిణీ నిర్వహించారు. విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి రైతులకు భూ హక్కు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం మార్గం చూపాలన్నదే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు . సమగ్ర రీ సర్వేతో భవిష్యత్తులో రికార్డులు తారుమారు చేయడానికి వీలుండదన్నారు. రైతులకు డిజిటల్ భూ హక్కు పత్రాలను ఇవ్వడం జరుగుతున్నారు.

వందేళ్ల తర్వాత భూసర్వే ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారని తెలిపారు.ఈ కార్యక్రమంలో బెస్త కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రమణ, ఎంపీపీ నారాయణ రెడ్డి, సర్పంచ్ ఓబులమ్మ ఎంపీటీసీ సభ్యుడు శివరాం రెడ్డి సింగల్ విండో ప్రెసిడెంట్ గంగాధర్ ,పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రామచంద్రారెడ్డి, వైస్సార్సీపీ నాయకులు ఆదినారాయణ,ఎర్రి స్వామి, ఓబన్న ,మదన్ మోహన్ రెడ్డి , హనుమంత రెడ్డి ,శంకర్ రెడ్డి , ఎంసి ఆంజనేయులు ,ఎర్రి స్వామి ,కార్యకర్తలు, తహసీల్దార్ శేషారెడ్డి , ఆర్ ఐ ప్రసన్నకుమార్ , వీఆర్వో సాయి కుమార్ , పంచాయితీ కార్యదర్శి హరి ,రైతులు, తదితరులు పాల్గొన్నారు.

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

తమ్మిశెట్టి పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.