దౌర్జన్యంగా తన భూమిలోకి వస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు
దౌర్జన్యంగా తన భూమిలోకి వస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు
AP 39TV న్యూస్ కూడేరు:
రమేష్ ,ఆదినారాయణ ,పెద్దన్న అనే ముగ్గురు వ్యక్తులు తన భూమిలోకి దౌర్జన్యంగా వచ్చి ఆక్రమణకు పాల్పడుతున్నారని కూడేరు మండలం కడదరకుంటకు చెందిన ఆవిలిగొండ వెంకటేష్ శనివారం కూడేరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సర్వేనెంబర్ 27లో మూడు ఎకరాలు పొలం ఉందని ,ఆ పొలానికి పట్టాదారు పాసుపుస్తకం ఉంది. అన్ని హక్కులు ఉన్నాయన్నారు .కానీ ఈ ముగ్గురు వ్యక్తులు కావాలని దౌర్జన్యంగా తన భూమిని ఆక్రమించుకునేందుకు వస్తున్నారని వెంకటేశులు ఎస్ఐ సత్యనారాయణకు వివరించారు. దీంతో ఎస్ఐ సత్యనారాయణ ఆ ముగ్గురుని పిలిపించి సుమారు 60 ఏళ్లుగా వెంకటేష్ భూమిని సాగు చేసుకుంటున్నాడు. ఇప్పటికిప్పుడు మీరు వచ్చి తమదంటే ఎలా అని ప్రశ్నించారు .ఇంతవరకు ఆ భూమి తమదని తెలియదని ఆ ముగ్గురు చెప్పుకొచ్చారు. దీంతో రికార్డ్స్ అన్ని వెంకటేష్ కు ఉన్నాయని ఆ పొలంలోకి వెళ్ళద్దని ఆ ముగ్గురికి ఎస్ హెచ్చరించారు.