బిజెపి బలోపేతానికి కృషి చేయండి

బిజెపి బలోపేతానికి కృషి చేయండి 

-బిజెపి జిల్లా అధ్యక్షుడు సంధి రెడ్డి శ్రీనివాసులు

 

 

AP 39TV ,న్యూస్ కూడేరు:

కూడేరు మండలంలో భారతీయ జనతా పార్టీ( బీజేపీ) బలోపేతానికి కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు ,ఉపాధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ , జిల్లా యువ మోర్చా అధ్యక్షులు అశోక్ రెడ్డి నాయకులకు పిలుపునిచ్చారు .శుక్రవారం కూడేరులో పార్టీ మండల కార్యవర్గ సమావేశం ఆ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయన్నారు. మండలానికి సంబంధించిన సంస్థాగత కమిటీలు త్వరగతిన పూర్తి చేయాలని సూచించారు.గత రెండు సంవత్సరాలుగా మండలంలో బిజెపి చాలా బలోపేతం చెందిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను మోసం చేసిందని, వారి అరాచకాలు స్వస్తి పలకాలి అంటే మనం ప్రజలు తరుపున ప్రజా ఉద్యమాలు చేపట్టాలని వారు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే రాష్ట్ర ప్రభుత్వానికి సరైన బుద్ది చెపుతారని వారు తెలిపారు.కార్యక్రమంలో సీనియర్ నాయుకులు రామాంజినేయులు, మల్లోబులు, రాము, చంద్ర శేఖర్ రెడ్డి, సందీప్, ధనుంజయ్, స్వామి, సత్తిరెడ్డి తదితులు పాల్గొన్నారు.

 

 

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు.

Leave A Reply

Your email address will not be published.