కమ్మూరుకు ఆర్టీసీ బస్సు ఏర్పాటు

కమ్మూరుకు ఆర్టీసీ బస్సు ఏర్పాటు

-ఆనందం వ్యక్తం చేసిన గ్రామస్తులు

కూడేరు,మార్చి14(AP 39 TV న్యూస్):-

ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి చొరవ.. ఆర్టీసీ రీజినల్ జోనల్ చైర్ పర్సన్ మంజుల కృషితో కూడేరు మండల పరిధిలోని కమ్మూరుకు ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేశారు .గురువారం సర్పంచ్ చిన్న రంగారెడ్డి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా కూడేరు నుంచి అరవకూరు మీదుగా కమ్మూరుకు బస్సు ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులు దృష్టికి తీసుకువెళ్లాం. బస్సు లేక విద్యార్థులు ,ప్రజలు తీవ్ర ఇబ్బంది పడేవారు. బస్సు ఏర్పాటు విషయమై విశ్వేశ్వర్ రెడ్డి, ఆర్టీసీ రీజినల్ చైర్ పర్సన్ మంజుల దృష్టికి తీసుకుపోవడం తో వారు స్పందించారని ఆయన తెలిపారు. బస్సు ఏర్పాటు కావడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు విశ్వేశ్వర్ రెడ్డికి మంజులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, వైఎస్సార్ సీపీ నేతలు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.