సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న ఎంపీపీ
కూడేరు(అక్టోబర్ 26)AP 39 TV న్యూస్:-
రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నర ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిన మేలును వివరించడానికి చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర గురువారం సింగనమల నియోజకవర్గంలో ప్రారంభమైంది. జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి , బెస్త కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రమణ కూడా బస్సు యాత్రలో పాల్గొన్నారు. విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ నారాయణరెడ్డి వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి కూడా బస్సు యాత్రలో పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు