సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్ నాగమ్మ

 

కూడేరు, AP 39 TV న్యూస్:-

కూడేరు మండల పరిధిలోని శివరాంపేటలో శుక్రవారం సర్పంచ్ నాగమ్మ సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూ.4 లక్షల వ్యయంతో ఈ సిమెంట్ రోడ్డు నిర్మించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక గ్రామీణ ప్రాంత రోడ్ల రూపురేఖలు మారుతున్నాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి , పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి మంజునాథ్ రెడ్డి , నేతలు క్రిస్టప్ప ,ఉదిరిపికొండ నరేష్ , రమేష్ నాయక్ శంకరయ్య వెంకటరామిరెడ్డి, రవి ,రామన్న , రామాంజనేయులు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు.

Leave A Reply

Your email address will not be published.