సిమెంట్ రోడ్డు నిర్మాణం పనులు

సిమెంట్ రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించిన ఎంపీపీ

 

కూడేరు,మార్చి19(AP 39 TV న్యూస్):-

కూడేరు మండలం పి. నారాయణపురంలో ఉపాధి హామీ విధులు కింద రూ.70 లక్షలతో దళితవాడకు సిమెంట్ రోడ్డు నిర్మిస్తున్నారు. మంగళవారం ఎంపీపీ నారాయణరెడ్డి సిమెంట్ రోడ్డు నిర్మాణపు పనులను పరిశీలించారు. పనులను నాణ్యతగా చేపట్టాలని తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితవాడకు గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు సరిగా ఉండేది కాదన్నారు.ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లగా ఆయన స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి సిమెంట్ రోడ్డు మంజూరు చేయించారని ఎంపీపీ తెలిపారు. సిమెంట్ రోడ్డు ఏర్పాటు అవుతుండడంతో దళితవాడ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు రామాంజనేయులు అక్కులన్న, గుర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.