ప్రజలకు ఉచితంగా సర్టిఫికెట్లు జారీ
-జడ్పీ సీఈఓ భాస్కర్ రెడ్డి , ఎంపీపీ నారాయణ
AP 39TV, న్యూస్ కూడేరు:
ప్రజలకు జగనన్న సురక్ష పథకం కింద కుల, ఆదాయ, జనన Z మరణ ,మ్యూటేషన్ వివాహ ,కౌలు రైతు గుర్తింపు కార్డులు , ఆధార్ లింక్ వంటి సర్టిఫికెట్లను ఉచితంగా మంజూరు చేస్తారని జడ్పి సీఈవో భాస్కర్ రెడ్డి ,ఎంపీపీ నారాయణరెడ్డిలు తెలిపారు.శనివారం కూడేరు మండలం గొటుకూరు గ్రామ సచివాలయం వద్ద జగనన్న సురక్ష స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు .ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగి శ్రమించాల్సిన అవసరం లేదన్నారు.ద్రువీకరణ పత్రాలు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరైన సర్టిఫికెట్లను పంపిణీ చేశారు . ప్రజలకు మరింత సేవలు అందించాలన్నదే జగనన్న సురక్ష ముఖ్యమని వారు తెలిపారు .ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆశాలత ,మండల స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ చౌదరి , ఎంపీడీఓ DMK బాషా ,MRO శేష రెడ్డి ,APO తులసి ప్రసాద్,, ఏపీఎం రాజశేఖర్, PR AE శ్రీనివాసులు,, HOUSING AE శేఖర్, RWS ఏఈ వు శ్రీనివాసులు,మండల పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయ సిబ్బంది,వాలంటీర్స్,మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు