రూ.2 లక్షల ప్రమాద బీమా చెక్కు పంపిణీ

రూ.2 లక్షల ప్రమాద బీమా చెక్కు పంపిణీ

AP 39 TV న్యూస్ కూడేరు:

కూడేరులోని సొసైటీ బ్యాంకులో బ్రాహ్మణపల్లికి చెందిన రైతు గంపిరెడ్డి క్రాప్ లోన్ పొందాడు . అదే సమయంలో ప్రమాద బీమా చేయించుకున్నాడు. ఆ రైతు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. దీంతో రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తించింది. గురువారం కూడేరులో ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి రైతు గంపిరెడ్డి భార్య నాగమణికి రెండు లక్షల చెక్కును అందజేశారు .ఈ బీమా మొత్తాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు కొర్రకోడు వడ్డే గంగాధర్ ,ఎంపీపీ నారాయణ రెడ్డి , కరుట్లపల్లి సర్పంచ్ ఓబులమ్మ , వైఎస్సార్ర్ సీపి నేతలు బైరెడ్డి రామచంద్రారెడ్డి , దేవేంద్ర ,ఎర్ర నాగప్ప ,సిద్ధారెడ్డి , రామాంజనేయులు, వెంకటేష్ , శంకరయ్య, బచ్చలయ్య ,అంజి, సొసైటీ సిబ్బంది శివ ,పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

పవన్ కుమార్

కుడేరూ, రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.