చేసిన మేలును ధైర్యంగా ప్రజలకు చెప్పండి
-మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి,ఎంపీ తలారి రంగయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య
కూడేరు(అక్టోబర్ 17)AP 39 TV న్యూస్:-
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగున్నర ఏళ్లలో చేసిన మేలును ధైర్యంగా ప్రజలకు చెప్పండి.. ఓట్లు అభ్యర్థించండని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య YSR CP నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మంగళవారం కూడేరులో మండల వైఏస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. 20 24 లో పార్టీ గెలుపే లక్ష్యంగా అందరూ పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం మండలం పార్టీ నూతన కమిటీని అనుబంధ విభాగాల అధ్యక్షులు కమిటీని ప్రకటించారు .వారికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో టిటిడి బోర్డు మెంబర్ అశ్వర్థ నాయక్, బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు వీరన్న, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రమణ, ఎంపీపీ నారాయణరెడ్డి, జెడ్పిటిసి అశ్విని, వైస్ ఎంపీపీలు సుబ్బమ్మ దేవ,పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రామచంద్రారెడ్డి, జేసిఎస్ కన్వీనర్ దేవేంద్ర , సింగల్ విండో ప్రెసిడెంట్ గంగాధర్,సచివాలయ కన్వీనర్లు ,గృహసారథులు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు