చేతి వృత్తిదారులకు వరం.. పీఎం విశ్వ కర్మ యోజన పథకం
చేతి వృత్తిదారులకు వరం.. పీఎం విశ్వ కర్మ యోజన పథకం
-బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్
కూడేరు (సెప్టెంబర్ 25)AP 39 TV న్యూస్:-
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం చేతి వృత్తిదారులకు వరంగా నిలుస్తుందని బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేర్కొన్నారు. విశ్వకర్మ యోజన పథకం గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని బిజెపి నేతలు సోమవారం కూడేరులో నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు .ఈ సందర్భంగాబీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొనకొండ రాజేష్ ఆధ్వర్యంలో ఆయనకు ఘున స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి చేతివృత్తిదారుడు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు కొనకొండ్ల రాజేష్ మండలంలో ప్రజలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన పథకం కింద సబ్సిడీ ట్రాక్టర్లు మంజూరు చేయాలని కోరారు .కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు .కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సంధి రెడ్డి శ్రీనివాసులు , తిరుపతి జిల్లా ఇంచార్జి కనంపల్లి చిరంజీవి రెడ్డి ,లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి , ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు రంజిత్ చౌహన్ ,బీజేపీ కూడేరు మండల అధ్యక్షులు ఆంజనేయులు , కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు మలోబులు ,ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు సదానంద ,ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి రాము ,కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి కొర్రకోడు రామాంజినేయులు, ఎస్టీ మోర్చా జిల్లా కార్యదర్శి హరి సంజీవ్ నాయక్ ,బీజేపీ సీనియర్ నాయకులు కమ్మే హనుమంతు , రామాంజినేయులు ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు