లాభసాటిగా చిరుధాన్యాల సాగు

లాభసాటిగా చిరుధాన్యాల సాగు

-ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి

కూడేరు(ఆగస్టు2)AP39TV ,న్యూస్:

చిరుధాన్యాలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తే దిగుబడి ఆశాజనకంగా ఉండి లాభసాటిగా ఉంటుందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు. బుధవారం కూడేరులో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ప్రకృతి వ్యవసాయం చేసే 144 మంది ఎస్సీ రైతులకు 100% రాయితీతో చిరుధాన్యాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు .ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించే దిశగా రైతులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు . ఉచితంగా అందజేసిన ఈ చిరుధాన్యాలను వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.అనంతరం చిరుధాన్యాల కిట్లను పంపిణీ చేశారు .కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడిఎ ఉమామహేశ్వరమ్మ ,ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సారయ్య, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శంకరయ్య ,ఎంపిపి నారాయణరెడ్డి ,అగ్రి అడ్వైజరీ మండల అధ్యక్షురాలు నిర్మలమ్మ ,ఎడి రవి ,ఎంపీడీవో ఎంకే భాషా AO విజయ్ కుమార్ ,ఏపీఎం రాజశేఖర్ , సర్పంచులు ,ఎంపీటీసీ సభ్యులు , వైయస్సార్ సీపీ నేత బైరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,తమ్మిశెట్టి పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.