జన సంద్రమైన చోళసముద్రం
AP39TV న్యూస్, కూడేరు:
కూడేరు మండల పరిధిలోని చోళసముద్రం గ్రామం మంగళవారం జన సంద్రమైంది. ఎందుకంటే 11 ఏళ్ల తర్వాత గ్రామస్తుల ఆధ్వర్యంలో గంగమాంబ దేవర కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా గ్రామస్తులు జరుపుకున్నారు. కార్యక్రమానికి గ్రామస్తులు బంధు,మిత్రులను ఆహ్వానించడంతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో గ్రామం జనాలతో కిటకిటలాడింది. గంగమ్మ దేవత మూల విరాటకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు . ఈ సందర్భంగా గంగమ్మ దేవత నామస్మరణ దేవర సందర్భంగా గ్రామ వీధుల్లో తిను బండారాల దుకాణాలు గాజులు బొమ్మలు ఇతర దుకాణాలు పెద్ద ఎత్తున వాటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపడంతో దుకాణాలు జనాలతో కిటకిటలాడాయి.గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.