సీఎం జగన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

సీఎం జగన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

 

కూడేరు,ఏప్రిల్ 14(AP 39 TV న్యూస్):-

 

సీఎం జగన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎంపీపీ నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం పై దాడికి నిరసనగా ఆదివారం కూడేరులో ఎంపీపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపిపి ,పార్టీ నేతలు మాట్లాడుతూ టిడిపి కుట్రలో భాగంగానే సీఎం పై దాడి జరిగిందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలవలేమని తెలిసి టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అల్లరి మూకులను ఉసకొలుపుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది వైఎస్ఆర్ సీపీ నే ఆన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, నేతలు విజయ భాస్కర్ రెడ్డి, క్రిష్టప్ప, రామాంజినేయులు , సర్దార్ వలి ,శంకర నాయక్ , శివరావు, సంగప్ప , శంకర్ రెడ్డి , వేణు , శ్రీకాంత్ ,కుమ్మరి శ్రీనివాస్ , ఎడమల వెంకటేష్ ,సుబ్బయ్య , సాకే కొండ , ఎంపీటీసీ రమేష్ , సంగప్ప ,లక్ష్మీనారాయణ జింక కృష్ణ ,శివ ,రామ్మూర్తి , ముత్యాలు ,బాబు ,సాధిక్ సుబ్బయ్య ,నాగేంద్ర , రామాంజి, ఎం నాగరాజు, జి పోలప్ప తదితరులు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.