సీఎం జగన్ సభకు తరలి వెళ్లిన కొర్రకోడు ,మరుట్ల వైఎస్సార్ సిపి నేతలు

సీఎం జగన్ సభకు తరలి వెళ్లిన కొర్రకోడు ,మరుట్ల వైఎస్సార్ సిపి నేతలు

 

 

AP39TV న్యూస్, కూడేరు:

శింగమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో బుధవారం “జగనన్న వసతి దీవెన ” పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి బటన్ నొక్కి నగదు జమ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమానికి కూడేరు మండలం కొర్రకోడు , మరుట్ల పంచాయతీల నుంచి వైఎస్ఆర్ సీపీ నేతలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు .ఈ సందర్భంగా కొర్రకోడు సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్ ,కూడేరు సింగిల్ విండో అధ్యక్షుడు వడ్డే గంగాధర్ మాట్లాడుతూ సీఎం జగన్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. చంద్రబాబు నాయుడు తన పాలనలో మాటలతో అభివృద్ధి గారిడి చేశారు .కానీ సీఎం జగన్ చేతుల్లో అభివృద్ధిని చేసి చూపించాడన్నారు. సభకు తరలి వెళ్లిన వారిలో ఎంపీటీసీ సభ్యుడు శివలాల్ రెడ్డి ,నేతలు బండారు శ్రీనివాసులు ప్రభాకర్, ఎర్రిస్వామి, శ్రీనివాసులు నాయుడు ,వెంకటేశులు, వెంకటరామిరెడ్డితోపాటు పలవురు నాయకులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.