శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్టును సందర్శించిన : జడ్పీ సీఈఓ

శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్టును సందర్శించిన

జడ్పీ సీఈఓ

కూడేరు,మార్చి 2 (AP 39 TV న్యూస్):

కూడేరు మండలం పీఏబీఆర్ డ్యాం వద్ద ఉన్న శ్రీరామ రెడ్డి తాగునీటి ప్రాజెక్టును జడ్పీ సీఈఓ నిదియా దేవి శనివారం సందర్శించారు. ప్రాజెక్టు ద్వారా ఎన్ని గ్రామాలకు నీటిని సరఫరా చేస్తారు. నీటి శుద్ధుని ఏ విధంగా చేస్తారు .వృధా నీటిని బయటికి ఎలా పంపుతారని డిఈ శ్రీనివాసులతో ఆరా తీశారు. ఫిల్టర్ బెడ్స్ ను పరిశీలించారు. దాదాపు 900 గ్రామాలకు ప్రాజెక్టు నుంచి సరఫరా చేస్తున్నట్టు డీఈ ఆమెకు వివరించారు. కార్యక్రమంలో ఏఈఈ లావణ్య, ఎంపీడీవో ముస్తఫా కమల్ భాష , సూపర్వైజర్లు మంజునాథ్ రెడ్డి ,లక్ష్మి రెడ్డి, తాగునీటి కార్మికులు గంగాధర్ నాగరాజు కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.