రేపే శ్రీ నీలకంఠ కోల్డ్ స్టోరేజ్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం
AP39TV NEWS ఏప్రిల్ 17:
గుడిబండ:- మండలంలోని మాజీ మంత్రి మాజీ ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మడకశిరలో నిర్వహించే ముఖ్యమైన సమావేశానికి అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మందలపల్లి నాగరాజు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న రఘువీరారెడ్డి అభిమానులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆయన అనుచరులకు ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీ నీలకంఠ కోల్డ్ స్టోరేజ్ లో సమావేశం ఏర్పాటు చేసి రానున్న 2024 వ సంవత్సరంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కార్యాచరణ విషయమై చర్చ ఉంటుందని తెలిపారు అలాగే కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు మే 10న జరుగుతున్న సందర్భంగా నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారిని బెంగళూరు బెంగళూరు పరిసర ప్రాంతంలో 18 నియోజకవర్గాల ఎన్నికల పరిశీలికుడుగా నియమితులైన సందర్భంగా మంగళవారం మడకశిర లో శ్రీ నీలకంఠ కోల్డ్ స్టోరేజ్ లో నియోజకవర్గంలోని రఘువీరారెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరారెడ్డి హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పాల్గొంటారని తెలిపారు కావున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రఘువీరారెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన తెలిపారు.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
AP 39TV
మడకశిర ఆర్సి ఇంచార్జ్
గుడిబండ