ఉరవకొండలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తాం
ఉరవకొండలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తాం
-ఉరవకొండ అసెంబ్లీ కోఆర్డినేట్ కమిటీ సభ్యుడు అమర నాథ్
AP 39TV న్యూస్ కూడేరు:
ఉరవకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తామని ఉరవకొండ అసెంబ్లీ కోఆర్డినేట్ కమిటీ సభ్యుడిగా నియమితులైన కూడేరు మండలం శివరాం పేటకు చెందిన అమరనాథ్ స్పష్టం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు
పార్టీ కోసం కష్టపడినందుకు అధిష్టానం తగిన గుర్తింపు ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. అసెంబ్లీ కోఆర్డినేట్ సభ్యునిగా నియామకం తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. గ్రామస్థాయి నుంచి కమిటీలను ఎంపిక చేసి పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. తన ఎంపికకు కృషి చేసిన ఏపీసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ,వర్కింగ్ ప్రెసిడెంట్ గౌతమ్, జిల్లా అధ్యక్షులు బండపల్లి ప్రతాపరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు