కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సభ్యులుగా మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఎంపికపట్ల హర్షం
కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సభ్యులుగా మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఎంపికపట్ల హర్షం
జిల్లా అధ్యక్షులు సుధాకర్
Ap39tv ఆగస్టు 20.
జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సభ్యులుగా మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఎంపిక పట్ల శ్రీ సత్యసాయి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కరికెర సుధాకర్ తమ హర్షం వ్యక్తం చేశారు.ఆదివారం తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ జాతీయ కాంగ్రెస్ పార్టీ కమిటీలో రఘువీరారెడ్డికి చోటు దక్కడం శుభపరిణామమన్నారు.ఈ నేపథ్యంలో ఏపీలో పార్టీ బలోపేతనికి ఇది ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున కార్గే నేతృత్వంలో జరిగిన సిడబ్ల్యూసి నియామఖంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది జాబితాలో సోనియా గాంధీ,రాహుల్ గాంధీ,మన్మోహన్ సింగ్ తదితరులతో పాటు ఏపీ నుంచి రఘువీరారెడ్డికి అవకాశం దక్కడం ఎంతో అభినందనియమన్నారు.ఈ కార్యక్రమంలో నియోజక వర్గంలోని పార్టీ మండల కన్వీనర్లు టీవిఎస్ మంజునాథ్,మందలపల్లి నాగరాజు,లోకేష్,నాయకులు డాక్టర్ రవిశంకర్,సురంగాల నాగరాజు,శివ,వరదరాజు,మల్లికార్జున,నారాయణప్ప,తదితరులు పాల్గొన్నారు.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
Ap39tv న్యూస్
మడకశిర ఇంచార్జీ గుడిబండ