కూడేరులో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా

కూడేరులో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా

 

కూడేరు (సెప్టెంబర్ 25)AP 39 TV న్యూస్:-

సిపిఐ ,వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం కూడేరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట పేదలకు ఇళ్ల పట్టాలు ,వర్షా భావంతో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ లో సాగు చేసిన పంటలు వర్షాభావంతో పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ప్రభుత్వం పంట నష్టం అంచనా వేయించి నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని పత్రాన్ని తాసిల్దార్ శేషారెడ్డికి అందజేశారు .కార్యక్రమంలో ఆ పార్టీల జిల్లా ,తాలూకా, మండల నాయకులు గోపాల్, మల్లికార్జున , పెరుగు సంగప్ప, రమణ, నారాయణరెడ్డి, శ్రీరాములుతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.