జర్నలిస్టుల రాష్ట్రస్థాయి క్రికెట్ తో చాటిన ఐక్యత

జర్నలిస్టుల రాష్ట్రస్థాయి క్రికెట్ తో చాటిన ఐక్యత

*ప్రతి ఏడాది రాష్ట్ర స్థాయి జర్నలిస్టు క్రికెట్ నిర్వహిస్తాం*

*అనంత జర్నలిస్టుల విజయం*

*మచ్చా రామలింగారెడ్డి*

*రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్*

——————————–

 

👉రాష్ట్రస్థాయి జర్నలిస్టు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఒకటేనని ఐక్యత చాటారని జర్నలిస్టులు అందరూ ఒకే కులం అని నిరూపించారని మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అన్నారు

 

👉అనంతలో రాష్ట్రస్థాయి జర్నలిస్టుల ఐక్యత క్రికెట్ టోర్నమెంట్ ముగిసిన సందర్భంగా మచ్చా రామలింగారెడ్డి మాట్లాడారు

 

👉అనంతలో జరిగిన రాష్ట్రస్థాయి జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం కావడంతో ప్రతి ఏడాది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని మచ్చా రామలింగారెడ్డి అన్నారు

 

👉అనంతలో వారం రోజులు పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి జర్నలిస్టు క్రికెట్ విజయవంతం చేయడంలో అనంతపురం వర్కింగ్ జర్నలిస్టులు విశేషంగా కృషి చేశారని వారందరి సహకారంతో గతంలో ఎన్నడూ లేని విధంగా అనంతలో రాష్ట్రస్థాయి జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించగలిగామని ఈ విజయం అనంతపురం జర్నలిస్టులకు అంకితం అనంత జర్నలిస్టుల స్ఫూర్తి రాష్ట్రంలో ఇతర జిల్లాలకు కూడా స్ఫూర్తినిస్తుందని మచ్చా రామలింగారెడ్డి అన్నారు

 

👉నిత్యం పని ఒత్తిడితో ఉన్న జర్నలిస్టు మిత్రులు గతంలో ఎన్నడూ లేని విధంగా అనంతలో టోర్నమెంట్ నిర్వహించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వర్కింగ్ జర్నలిస్టులు ఈ టోర్నమెంట్ లో పాల్గొని చరిత్ర సృష్టించారని కడప జట్టు విన్నర్స్ గా, వైజాగ్ జట్టు రన్నర్స్ గా గెలుపొందిన విషయం తెలిసిందే అని కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, వైజాగ్, అనకాపల్లి, ఇతర జిల్లాల నుండి వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఈ టోర్నమెంట్ లో పాల్గొనడం అభినందనీయమని మచ్చా రామలింగారెడ్డి అన్నారు

 

👉 టోర్నమెంట్ విజయవంతం కావడానికి సహకరించిన రాష్ట్రస్థాయి జర్నలిస్టు క్రికెట్ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా కలెక్టర్లు గౌతమి, ఆనంద్ బాబు, ఎస్పీ అన్బురాజన్ ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు అందరికీ అభినందనలు తెలుపుతున్నామని మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అన్నారు

 

👉 వారం రోజులు పాటు మీడియా వారు కూడా ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా చిన్న పత్రికలు యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా సహకారం అందించి విజయవంతం చేశారని వారికి కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున అభినందనలు తెలుపుతున్నామని మచ్చ రామలింగారెడ్డి అన్నారు

 

విలేకరుల సమావేశంలో విజయరాజు, ఖాన్, షకీర్, లోక్ రాజ్, త్యాగరాజు, రఘు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

———————————-

 

Leave A Reply

Your email address will not be published.